టీఎస్పీఎస్‌సీలో 10 కొత్త పోస్టులు.. పరీక్షల కంట్రోలర్‌గా IAS!

by Satheesh |   ( Updated:2023-04-21 15:07:21.0  )
టీఎస్పీఎస్‌సీలో 10 కొత్త పోస్టులు.. పరీక్షల కంట్రోలర్‌గా IAS!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో (TSPSC) మరో 10 కొత్త పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కావడం సంచలనంగా మారడంతో ఇకపై నియామక పరీక్షలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ కొత్త పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పరీక్షల కంట్రోలర్, డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్, జూనియర్ నెట్ వర్క్ అడ్మినేస్ట్రేటర్, సీనియర్, జూనియర్ ప్రోగ్రామర్, లా ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ఐఏఎస్ అధికారి బీఎం సంతోష్‌ను టీఎస్పీఎస్సీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా నియమించింది. కాగా, టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ప్రభుత్వం బోర్డులో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది.

Advertisement

Next Story

Most Viewed