దళితులను ఆదుకోవడంలో రాష్ట్రం ముందంజ

by Shyam |
దళితులను ఆదుకోవడంలో రాష్ట్రం ముందంజ
X

దిశ, గజ్వేల్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన భ్యాగరి నర్సింహులు రైతు కుటుంబానికి భూమి తాలూకు పత్రాలను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్బంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఓ దళిత కుటుంబాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదుకోవడంలో ఈ ఘటన చరిత్రలో నిలుస్తుందన్నారు. దళితులను ఆదుకోవడంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు.

గతంలో మంత్రి హరీష్ రావు బాధిత నర్సింహులు కుటుంబానికి రూ. 2 లక్షలు ఎక్స్‎గ్రేషియా, ఉద్యోగం, ఒక ఎకరం భూమిని ఇస్తామని హామీ ఇవ్వగా.. ఇప్పుడు ఇచ్చిన హామీ కంటే అదనంగా మరో అర ఎకరం భూమిలో ఒక బోర్ వేసి ఇచ్చామని స్పష్టం చేశారు. నర్సింహులు మృతికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Read Also…

రెవె‘న్యూ’ చట్టం.. సమస్యలొస్తే కోర్టులే శరణ్యమా..?

Advertisement

Next Story

Most Viewed