తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ వెబ్సైట్ డౌన్.. కంప్లైంట్ చేసేదెట్టా?

by Shyam |   ( Updated:2021-10-09 08:43:34.0  )
తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ వెబ్సైట్ డౌన్.. కంప్లైంట్ చేసేదెట్టా?
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని ఆహార, పోషకాహార సంబంధిత సమస్యల అమలును పర్యవేక్షించే తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ వెబ్సైట్(tsfc.telangana.gov.in) పనిచేయడం లేదు. గత కొన్ని రోజులుగా వెబ్సైట్ ఓపెన్ అవకుండా.. సైట్ అందుబాటులో లేదు అని వస్తోంది. అయితే, తెలంగాణ ఫుడ్ కమిషన్ రాష్ట్రంలోని స్కూళ్లలో అందించే మధ్యాహ్న భోజనాల నాణ్యతను, అంగన్ వాడీల్లో అందజేసే ఆహారపదార్థాలను అంతేాకాకుండా రేషన్ షాపులను మానిటరింగ్ చేస్తుంటారు. అయితే, వీటి అమలులో ఎలాంటి తప్పిదం ఉన్నా సైట్ ద్వారా తెలియజేసే అవకాశం ఉండేది. సైట్ ఓపెన్ అవకపోవడంతో ఫిర్యాదు చేయడం ఎలా అని సామాజిక వేత్త మహమద్ షాబుద్దిన్ ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
Advertisement

Next Story

Most Viewed