26న సంపూర్ణ 'భారత్‌ బంద్‌'కు సీపీఐ (మావోయిస్టు) పిలుపు

by Anukaran |   ( Updated:2021-03-17 02:41:03.0  )
26న సంపూర్ణ భారత్‌ బంద్‌కు సీపీఐ (మావోయిస్టు) పిలుపు
X

దిశ,వెబ్‌డెస్క్: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న రైతులు ఈ నెల 26న సంపూర్ణ ‘భారత్‌ బంద్‌’కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

అయితే రైతుల భారత్ బంద్ కు భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) మద్దతు పలికింది. రైతుల కోసం పోరాడే దేశ ప్రజలు మార్చి 26న జరిగే భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని కోరింది. సామ్రాజ్యవాదుల ప్రాయోజిత ఆదేశాలతో మోడీ ప్రభుత్వం ముందుకు తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు రైతాంగం పోరాటాన్ని కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

కాగా వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గతేడాది నవంబర్ 26 నుంచి ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో పంజాబ్‌తోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన 40 కిపైగా రైతు సంఘాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రైతుల ఆందోళన మార్చి 26కి నాలుగు నెలలు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 26న దేశవ్యాప్తంగా సంపూర్ణ ‘భారత్‌ బంద్‌’కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.

statement on Bharath Bandu (1)

Advertisement

Next Story