- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘విద్యుత్ వృద్ధిరేటులో తెలంగాణ నెం.1’
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ వ్యాప్తంగా ప్రతి తండా, ప్రతి గ్రామం, మండలం, జిల్లాలో విద్యుత్ సరఫరా ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే పూర్తిస్థాయి విద్యుద్దీకరణ జరిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందని వెల్లడించారు. అంతేకాకుండా తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని వృద్ధిరేటులో మాత్రం రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంత? తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ ఏ స్థానంలో ఉంది? రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి తీసుకుంటున్న చర్యలేవని మంగళవారం అసెంబ్లీలో పలువురు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానమిచ్చారు. రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందించినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ సమస్యలు ఎదుర్కొన్నామని, కానీ సీఎం కేసీఆర్ దార్శనికతతో విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్రంలో రెండు డిస్కంల ద్వారా కోటి 65 లక్షల కనెక్షన్లు ఇచ్చామని అంతేకాకుండా… రాష్ట్రం ఏర్పడిన సమయంలో 19 లక్షలు మాత్రమే ఉన్న వ్యవసాయ కనెక్షన్లు రాష్ట్రం వచ్చిన తర్వా 25.63 లక్షల వరకు పెరిగాయని వెల్లడించారు.