బతుకమ్మ సాంగ్ అదిరింది.. కవిత పాట ఇదే..!

by Shyam |   ( Updated:2023-10-10 15:13:08.0  )
Jagruthi Song
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో జరిగే తొమ్మిదిరోజుల ఉత్సవానికి సంబంధించిన జాగృతి పాట మంగళవారం విడుదలైంది. ‘అల్లిపూల వెన్నెల’ అంటూ మొదలైన పాట తెలుగు ప్రజల్ని ఆకట్టుకుంటోంది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ పాటను తీర్చిదిద్దారు. తెలంగాణ బతుకమ్మ విశిష్టతను విశ్వతరం చేసేలా తెలంగాణ జాగృతి సభ్యులు విడుదల చేసిన ఈ పాటను లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమన్ కంపోజ్ చేయాగా.. గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించారు. ‘అందరు ఆడి పాడుకునే మట్టి మనుషుల పండుగ కోసం.. మా మనసులోని భావాలకి.. మా హృదయ స్వరాలని కూర్చి ఒక పాటగా పేర్చి బతుకమ్మ కానుకగా అందిస్తున్నాం’ అంటూ ఇద్దరు దర్శకులు ప్రేక్షకులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed