- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐటీ, లైఫ్ సైన్సెస్‌లో తెలంగాణ లీడర్: కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోనే విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదివారం హైసియా ఆధ్వర్యంలో హెచ్ఐసీసీలో బ్రాండ్ హైదరాబాద్ అనే అంశంపై జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడారు. మా విధానాల ద్వారానే యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వచ్చాయని, ఐటీ, లైఫ్ సైన్సెస్‌లో తెలంగాణ లీడర్‌గా ఉంటుందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, ఈ వెహికల్స్, టెక్స్ టైల్స్, లాజిస్టిక్ సెక్టార్ వంటి రంగాల్లో పురోగతిని సాధిస్తున్నామని, హైదరాబాద్‌లో ఎస్ఆర్డీపీ కింద సమగ్ర రోడ్డు మేనేజ్మెంట్ ప్రోగ్రాం చేస్తున్నట్లు వెల్లడించారు.
రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనలో ముందున్నామని, మురుగు నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచినట్లు మంత్రి చెప్పారు. 1916 నాటి వర్షాలు మళ్లీ రావడంతో నాలాలు పొంగిపొర్లాయని, అందుకే ఇప్పుడు ఎస్ఎన్డీపీ కింద నాలాల శుద్ధీకరణ చేపడుతామన్నారు. కొందరు ఎన్నికల కోసం విద్వేషాలను రేకెత్తించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.