- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రం రాజకీయాలను పక్కనపెట్టి కేటాయింపులు చేయాలి : మంత్రి ఈటల
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. తెలంగాణలో రోజు రోజుకు కరోనా రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కరోనా పరిస్థితులపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు మీడియాతో ముచ్చటిస్తూనే ఉన్నారు. మొదటి వేవ్ ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని ఇప్పుడు సెకండ్ వేవ్ ను కూడా ఎదుర్కొంటామని ఈటల అన్నారు. వ్యాక్సిన్, ఆక్సిజన్ మాదిరిగా రెమిడిసివిర్ మా పరిధిలో ఉంటుందని చెప్పిన కేంద్రానికి 4 లక్షల రెమిడిసివిర్ కోరగా, 21 వేల వాయిల్స్ రెమిడిసివిర్ మాత్రమే తెలంగాణకి ఇచ్చిందన్నారు. కేంద్రం వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తున్నామని ఈటల అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం పక్కన పెట్టి కేటాయింపులు చేయాలన్నారు. దీనిపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కి లేఖ రాస్తునట్లు తెలిపారు. అంతే కాకుండా ఒడిషా లోని 12 వందల కిలోమీటర్ల దూరం నుంచి ఆక్సిజన్ తరలించడం కష్టతరం అవుతుందన్నారు. పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఆక్సిజన్ కృత్రిమ కొరతకు పాల్పడి.. బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.