- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనాపై ఆరోగ్యశాఖ అప్రమత్తం.. 12 జిల్లాల్లో అలర్ట్
ప్రభావిత జిల్లాలివే: కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్
మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సరిహద్దు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో రోజుకు యాభై వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. వైరస్ప్రభావం రాష్ట్రంలోని 12 జిల్లాలపై పడే అవకాశం ఉన్నదని హెచ్చరించిన మంత్రి ఆ రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్లపై నిఘా వేయాలని ఆదేశించారు. 104,108 సర్వీసులను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. పాండమిక్గా వచ్చిన వైరస్ అంత ఈజీగా రాష్ట్రం నుంచి పోదని, రిలాక్స్ భావన మంచిది కాదని అటు వైద్య సిబ్బందికి సూచిస్తూనే ప్రజలను అప్రమత్తం చేశారు. పాఠశాలల్లో భౌతిక తరగతులు జరుగుతున్నందున విద్యాశాఖతో సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని, ఎప్పటికప్పడు పరిస్థితిని గమనిస్తూ ఉండాలని వైద్య సిబ్బందికి మంత్రి ఆదేశాలు జారీచేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలోని 12 జిల్లాల్లోని వైద్యాధికారులు అలర్డ్ అయ్యారు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, జగిత్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని వైద్యాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండంతో కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం సచివాలయంలో ఆ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల రాకపోకలమీద ప్రత్యేక దృష్టి సారించి కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతిరోజూ కనీసం 50 వేల టెస్టులు చేయాల్సిందేనని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాలను పక్కాగా అమలుచేయాలన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన జిల్లాల్లోని వైద్యాధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. పాఠశాలల్లో భౌతిక తరగతులు జరుగుతున్నందున విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని గమనించాలన్నారు. విద్యాశాఖతో సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచించారు. 104,108 సర్వీసులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 44 కేసులు
వారం రోజుల తర్వాత జీహెచ్ఎంసీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. వారం రోజులుగా నగరంలో (జీహెచ్ఎంసీ పరిధి) సగటున 30 కేసులు మాత్రమే నమోదుకాగా గడచిన 24 గంటల వ్యవధిలో మాత్రం 44 కేసులు నమోదవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో సైతం కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మెజార్టీ ప్రజలు కరోనా నిబంధనలను పట్టించుకోవడంతో కొత్తగా కేసుల సంఖ్య పెరుగుతోంది.