- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గల్ఫ్’ సంకేతాలు.. జాతీయ స్థాయిలో మరో కొత్త పార్టీ..!
దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ( తెగువ) మరో అడుగు ముందుకేస్తోంది. రాష్ట్రం నుంచి వలస వెళ్లిన కార్మికులను చైతన్యం చేసి పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాల గల్ఫ్ వలస కార్మికుల ప్రతినిధులతో సమావేశం జరుపుతోంది. తెగువ ముఖ్య నేత నంగి దేవేందర్ రెడ్డి నేతృత్వంలో ఈ సమీకరణాలు నడుస్తున్నాయి.
13 రాష్ట్రాలు… 100 జిల్లాలు
దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 100 జిల్లాలకు చెందిన వారు గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళినట్టు తెగువ ప్రతినిధులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 88 లక్షల మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఉపాధి పొందుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో 36, తమిళనాడు, బీహార్‌లో 13, కేరళ 11, పంజాబ్ 7, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ 6, తెలంగాణ పాత జిల్లాలు 4, ఒడిశా, మహారాష్ట్ర 3, జమ్మూకాశ్మీర్ 2, కర్ణాటకలో ఒక జిల్లాకు చెందిన వారు గల్ఫ్ దేశాల్లో జీవిస్తున్నట్టు గుర్తించారు. ఆయా రాష్ట్రాలకు చెందిన కార్మికుల ప్రతినిధులు ఢిల్లీలో తెగువ ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. మంగళవారం కూడా ఈ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రాలకు బాధ్యులను నియమించుకున్న తర్వాత రాష్ట్రాల వారీగా జూమ్ మీటింగ్స్, జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించుకోనున్నారు. అనంతరం జాతీయ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి విధి విధానాలు, డిమాండ్లు తెలిపే అవకాశం ఉంది.
ప్రధాన ఎజెండా..
గల్ఫ్ వలస కార్మికులకు సంక్షేమంలో వాటా ఎంత అన్నదే ప్రధాన ఎజెండా కానుంది. వీరందరిని సమైఖ్య పరిచిన తర్వాత జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు చేసే యోచనలో తెగువ ఉంది.
- Tags
- New Party