- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కల్వకుర్తి’ ఏ పాపం చేసింది సారూ!
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు పరిహాసంగా మారుతున్నాయి. ఫలితంగా జిల్లా వాసులు కష్టాలు తప్పడం లేదు. దీని ద్వారా సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు, వాటితో పాటు కుంటలు, పరిసర గ్రామాలకు నీటి వసతులు కల్పించే అవకాశమున్నా.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పనులు ముందుకు సాగడం లేదు. ఈ పథకానికి ప్రధానమైన ఎల్లూరు లిఫ్ట్ వద్ద షెటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వం, అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏండ్లు గడుస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కల్వకుర్తి ఎత్తిపోతల పనులు మూడడుగులు ముందుకు అరు అడుగులు వెనక్కు అనే చందంగా సాగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రధాన నీటి వనరుగా పేరొందిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు నేటికీ పరిహాసంగా మారుతున్నాయి. కల్వకుర్తి కింద సుమారు 4లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు పలు చెరువులు, కుంటలకు నీటి వసతితో పాటుగా అనేక గ్రామాలకు తాగునీటి వసతిని కల్పించాల్సిన ఈ పథకం పనులు.. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా ముందుకు సాగడం లేదు. ఈ పథకం కింద ప్రధానమైన ఎల్లూరు లిప్ట్ వద్ద అవసరమైన షట్టర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి ఏండ్లు గడుస్తున్న నేటికీ ప్రభుత్వం, అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.
కృష్ణా తీరంలోని రేగుమాన్ గడ్డ వద్ద కాల్వ ద్వారా వచ్చే శ్రీశైలం వరద జలాలు సొరంగం నుంచి నేరుగా ఎల్లూరు సర్జ్ పూల్‌లోకి చేరుతాయి. ఇలా నీరు నేరుగా వచ్చి చేరడం కారణంగా అనేక సమస్యలు ఉత్పనం అవుతున్నాయని, వాటిని పరిష్కారించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి పలు మార్లు సూచించినప్పటికీ నేటికీ ఫలితం కనిపించడం లేదు. 2012 నుంచి ఈ లిఫ్ట్ ద్వారా శ్రీశైలం జలాల ఎత్తిపోతలు కొనసాగుతుండగా 2014లో కృష్ణానది వరదలు ముంచెత్తడంతో నీరు భారీగా వచ్చి చేరడంతో లిఫ్ట్‌లోని మోటార్లు మునిగిపోయి పాడైపోయాయి. దీంతో నీటి ఎత్తిపోతలు నిలిచిపోయి అనేక అవస్థలు పడాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో సర్జ్ పూల్‌లోని పంప్ మోటర్ల కోసం సొరంగం ముఖద్వారం వద్ద షటర్లను ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశముందని ఉందని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదించారు. దీని కోసం 2016-17లో రూ.2కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ నేటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సర్జ్ పూల్‌లోకి వేగంగా నీరు వచ్చి చేరడంతో వరద జలాలతో పాటు భారీగా ఒండ్రు మట్టి, ఇతర వ్యర్థాలు సైతం వచ్చి చేరుతుండడంతో అనేక సమస్యలు ఉత్పనం అవుతున్నాయి. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి ఈ పథకానికి షట్టర్ బిగించే విధంగా తగు చర్యలు తీసుకొని రైతులకు ఆటంకం లేకుండా సాగునీరు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.