- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో లాక్‌డౌన్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బుధవారం (మే నెల 12) నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రతీ రోజు ఉదయం పది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు లాక్‌డౌన్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రం ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలు, నిత్యావసరాలు, మందులు తదితరాలను కొనుగోలు చేయడానికి మాత్రం అవకాశం కల్పించింది. హైకోర్టులో విచారణ జరుగుతూ మధ్యాహ్నం 2.30 గంటల వరకు ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయాలని డెడ్‌లైన్ విధించినందున మంత్రివర్గం అత్యవసర నిర్ణయం తీసుకుంది.
టీకాలకు కొరత ఏర్పడిన దృష్ట్యా విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు వెళ్ళనున్నట్లు ప్రకటించింది.