- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాన్స్‌పోర్ట్ భవన్‌లో రాష్ట్రావతరణ వేడుకలు
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు రవాణా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్ భవన్‌లో ఘనంగా జరిగాయి. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, ప్రభుత్వ నియమ, నిబంధనలకు అనుగుణంగా వేడుకలు నిర్వహించారు. కమిషనర్ ఎం.ఆర్.ఎం రావు తొలుత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటం, డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి సిబ్బందికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. దశాబ్దాల పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ అభివృద్ది పథంలో పరుగులు పెడుతుండటం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రగతి కోసం జరుగుతున్న కృషిలో అందరూ సహాయ, సహకారాలు అందించాలని కోరారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో రవాణా శాఖ తన వంతు కృషి చేస్తోందని తెలిపారు.