తెలంగాణలో కరోనా హెల్త్ బులెటిన్ రిలీజ్

by vinod kumar |   ( Updated:2021-06-12 09:13:19.0  )
corona active cases in telangana district wise
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 1,20,525 టెస్టులు చేయగా 1,771 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,133 ఉండగా, ఒక్క రోజులో 13 మంది చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా 3,469 మంది చనిపోయారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 171, భద్రాద్రి కొత్తగూడెంలో 107, కరీంనగర్‌లో 99, ఖమ్మంలో 149, మహబూబ్‌నగర్ 50, మహబూబాబాద్ లో 73, మంచిర్యాల 57, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 104, నల్గొండలో 157, పెద్దపల్లిలో 82, రంగారెడ్డిలో 85, సిద్దిపేటలో 50, సూర్యపేట 86, వరంగల్‌ అర్బన్‌లో 64 కేసులు నమోదయ్యాయి.

అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 07, జగిత్యాలలో 44, జనగాంలో 15, జయశంకర్ భూపాలపల్లి 42, జోగుళాంబ గద్వాలలో 21, కామారెడ్డిలో 02, కొమరంభీం ఆసిఫాబాద్ లో 05, మెదక్ లో 11, ములుగులో 33, నాగర్‌కర్నూల్ 25, నారాయణపేటలో 09, నిర్మల్‌లో 03, నిజామాబాద్ లో 21, రాజన్న సిరిసిల్లాలో 36, సంగారెడ్డిలో 40, వికారాబాద్ లో 25, వనపర్తిలో 35, వరంగల్ రూరల్ 27, యాదాద్రి భువనగిరి 36 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 2,09,374 మందికి వ్యాక్సిన్ అందించారు. వీటిలో మొదటి డోసు వ్యాక్సిన్‌ను 1,96,887 మందికి, రెండవ డోసు వ్యాక్సిన్‌ను 12,487 మందికి అందించారు. ఇప్పటివరకు మొత్తం 61,13,416 మందికి, రెండవ డోసు వ్యాక్సిన్‌ను 14,95,199 మందికి అందించారు.

Advertisement

Next Story

Most Viewed