- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీలో వారిదే ఇష్టారాజ్యం: కాంగ్రెస్ నేతలు
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ మ్మెల్యేలు భగ్గుమన్నారు. సభను ఇష్టారాజ్యంగా నడుపుతున్నారని, ప్రభుత్వానికి సంబంధించిన ప్రశ్నలు అధికార పార్టీ ఎమ్మెల్యేలతోనే అడిగించుకుని మంత్రులు సమాధానం చెప్పేలా ప్లాన్ చేశారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష సభ్యులకు కనీసం మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదని, ప్రతిపక్షాలు కనీసం నోరెత్తకుండా సభలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ప్రభుత్వం తరఫున వివరణ ఇచ్చేందుకే అధికారపక్షం సమయం తీసుకుంటుందని, దానిపై చర్చ చేసేందుకు కాంగ్రెస్సభ్యులకు అవకాశమే ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే గన్‌పార్క్‌వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నల్ల కండువాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు.
అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సభను ఏకపక్షంగా నడుపుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌లో కూడా చాన్స్ఇవ్వలేదని, వారే ప్రశ్నలు అడుగుతూ వాళ్లే సమాధానం చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలను సభలో ఒక్కరూ కూడా ప్రస్తావించడం లేదని, కేవలం అధికార పార్టీకి అక్కరకు వచ్చే ప్రశ్నలు అడుగుతున్నారన్నారు. అసెంబ్లీ స్పీకర్‌కు దీనిపై వివరంగా లేఖ ఇస్తున్నామని, ట్రీ బ్రేక్‌లో స్పీకర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి తెలిపారు.
కాంగ్రెస్‌తోనే రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ స్వపక్షంలో విపక్షంగా వ్యవహరించే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నిరసన చేపట్టారు. సందర్భం ఏదైనా ఎక్కడైనా కాంగ్రెస్‌ను విమర్శించడం, బీజేపీని ఎత్తుకోవడం ఇటీవల పరిపాటిగా మారింది. ఏకంగా బీజేపీ నుంచే పోటీచేసేందుకు ఆఫర్ కూడా వచ్చిందని ప్రకటించి సంచలనం సృష్టించారు. రాజగోపాల్‌రెడ్డి 2018 నుంచే కాంగ్రెస్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయమైపోయిందని పార్టీలో చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం గన్‌పార్క్‌వద్ద కాంగ్రెస్ నల్ల కండువాలతో నిరసనకు దిగగా.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా కలిసొచ్చారు. ఎప్పుడూ కాంగ్రెస్సభ్యులతో వేరుగా ఉండే ఆయన కలిసి రావడం అధికార, ప్రతిపక్ష పార్టీలో చర్చ సాగుతోంది.
మా హక్కులను కాపాడండి : శ్రీధర్‌బాబు
గన్పార్క్దగ్గర నిరసన అనంతరం కాంగ్రెస్ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడారు. తాము ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ హక్కులను కాపాడాలని స్పీకర్‌ను కూడా కోరామన్నారు. సమయం ఇచ్చిన ఇవ్వకపోయినా ప్రజల పక్షాన తమ గొంతును వినిపిస్తున్నామని, ప్రజల సమస్యలు వినడానికి అధికార పార్టీ నేతలకు ఓపిక కూడా లేదని శ్రీధర్‌బాబు ఆరోపించారు. సభలో ప్రజాసమస్యలు కాకుండా సొంత సమస్యలపై మాట్లాడుతున్నారని, ప్రతిపక్షాలు మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇక అధికార పార్టీ సభ్యులే అసెంబ్లీ నడుపుకుంటే మంచిదని ఆయన హితవుపలికారు.