- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర బడ్జెట్రూ. 2.30 లక్షల కోట్లు : రైతు బంధుకు రూ.14,800 కోట్లు
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ. 2.30 లక్షల కోట్లుగా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్లో గతంలో కంటే దాదాపు రూ. 48 వేల కోట్లను పెంచారు. మొత్తం రూ. 2,30,825.96 కోట్ల బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ. 1,69,383.44 కోట్లు కాగా క్యాపిటల్ వ్యయం రూ. 29,046.77 కోట్లు. రెవెన్యూ మిగులు వ్యయం రూ. 6,743.50 కోట్లు చూపించగా… ఆర్థిక లోటు రూ. 45,509.60 కోట్లుగా అంచనా వేశారు.
దేశమంతా కరోనా విజృంభణతో తల్లడిల్లిగా తెలంగాణ రాష్ట్రం తట్టుకుని నిలబడింది. గత ఏడాది రూ. 1.82 లక్షల కోట్ల బడ్జెట్ ఈసారి రూ. 2.30 లక్షల కోట్లుగా ప్రభుత్వం ప్రతిపాదించింది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,47,145 ఉంటుందని కేంద్ర గణాంక శాఖ అంచనా వేసింది. గత ఏడాది కంటే 0.6 శాతం ఎక్కువగా చూపించారు. ఇక దేశ తలసరి ఆదాయం రూ. 1,27,768 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ లెక్కన తెలంగాణ తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే రూ. 99,377 అధికంగా ఉంది. దేశ ఆదాయం తగ్గినా తెలంగాణ ఆదాయం పెరిగింది.
అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశ పెట్టుతూ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని, ఇంటా బయటా ప్రశంసలు అందుకుంటోందన్నారు. కరోనా కాలంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నామని మంత్రి వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే విధంగా బడ్జెట్ ఉందన్నారు.
రైతుబంధుకు రూ. 14,800 కోట్లు
రాష్ట్ర బడ్జెట్లో అధికంగా గ్రామీణాభివృద్ధి శాఖకే కేటాయింపులు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 29,271 కోట్లు ప్రతిపాదించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు కోసం ఈ బడ్జెట్లో రూ. 14,800కోట్లు కేటాయింపులు చేశారు. ఈసారి రుణమాఫీ కోసం కూడా నిధులు పెట్టారు. రుణమాఫీ కోసం రూ. 5,225 కోట్లు ఇచ్చారు. ఇక వ్యవసాయ రంగానికి రూ. 25 వేల కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ. 1730 కోట్లు కేటాయింపులు చేశారు. సాగునీటి రంగానికి రూ. 16,931 కోట్లు కేటాయించగా… సమగ్ర భూ సర్వే కోసం ఈసారి రూ. 400 కోట్లు ప్రతిపాదించారు. ఇక ఆసరా పింఛన్ల కోసం రూ. 11,728 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించారు.
2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ. 2,30, 825, 96 కోట్లు.
♦ రెవెన్యూ వ్యయం రూ. 1, 69, 383.44 కోట్లు.
♦ క్యాపిటల్ వ్యయం రూ. 29, 046.77 కోట్లు.
♦ రెవెన్యూ మిగులు రూ. 6, 743.50 కోట్లు.
♦ ఆర్థిక లోటు రూ. 45, 509.60 కోట్లు
♦ రీజనల్ రింగ్ రోడ్డు భూ సేకరణకు రూ.750 కోట్లు
♦ కొత్త సచివాలయ నిర్మాణానికి రూ.610 కోట్లు
♦ దేవాదాయ శాఖకు రూ.720 కోట్లు
♦ అటవీ శాఖకు రూ.1,276 కోట్లు
♦ ఆర్టీసీకి రూ. 1,500 కోట్లు