బయటకొస్తే క్రిమినల్ కేసులు, వాహనాలు సీజ్

by Shyam |
బయటకొస్తే క్రిమినల్ కేసులు, వాహనాలు సీజ్
X

తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. దానిని కట్టడి చేసేందుకే ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ను బేఖాతర్ చేస్తూ ప్రజలు రోడ్లపైకి రావడం మంచిది కాదు. ఈ రోజు ఉదయం నుంచి ఎవరూ రోడ్లపైకి రావడానికి వీళ్లేదు.అత్యవసర పరిస్థితి అయితే రావాలి. లేనియెడల అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెడుతామని డీజీపీ హెచ్చరించారు. అంతేకాకుండా మళ్లీ మళ్లీ నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలు సీజ్ చేస్తామన్నారు. ఒకే చోట ప్రజలు గుంపులుగా కనిపించినా కఠిన చర్యలు తప్పవన్నారు. సమస్య తీవ్రంగా ఉంది కావునే ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నదన్నారు. అలాగే రాష్ట్రంలో అడుగడుగునా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, దానికి సంబంధించి రాష్ట్ర పోలీసులకు స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేశామన్నారు.ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాలని, తమ స్వస్థలాలకు వెళ్లడానికి కూడా వీళ్లేదన్నారు. బైకుపై ఒకరు, కారులో ఇద్దరు మించి ప్రయాణాలు చేయరాదన్నారు.కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో కఠిన నిబంధనలు అమలు చేయడం వల్లే అక్కడ పరిస్థితి కొద్ది కొద్దిగా మెరుగవుతోంది. ప్రస్తుత పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి. రానున్న వారం, పది రోజులు చాలా అలర్ట్‌గా ఉండాలి. అప్పుడే కొంచెమైనా కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది.అలా కాకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని డీజీపీ హెచ్చరించారు.

Tags: telagana dgp mahender reddy, serious actions, lock down, dont comeout side, criminal cases put for voilation

Advertisement

Next Story

Most Viewed