ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలి.. తేజస్వీ యాదవ్ పిలుపు

by Shamantha N |   ( Updated:2021-07-10 11:04:27.0  )
ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలి.. తేజస్వీ యాదవ్ పిలుపు
X

పాట్నా: బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత, బిహార్ అపోజిషన్ లీడర్ తేజస్వీ యాదవ్ పిలుపునిచ్చారు. ఇందుకోసం తమ భేదాభిప్రాయాలను, అహాన్ని పక్కనబెట్టాలని సూచించారు. బీజేపీని ఎదుర్కోవడంలో విఫలమైతే గనుక చరిత్ర క్షమించదని తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. ‘దేశ రాజకీయాలపై ప్రతిపక్ష నేతలందరూ త్వరలోనే కూర్చుని మాట్లాడుకుంటారని భావిస్తున్నాను. ఆ సమయం ఆసన్నమైంది.

వీలైనంత తొందరగా దీనిని మొదలుపెట్టాలి. ప్రతిపక్షాలు లేవనెత్తడానికి దేశంలో సమస్యలకు కొరత లేదు. భవిష్యత్‌లో ఏదైనా ప్రతిపక్ష కూటమి ఏర్పడితే గనుక దానికి కాంగ్రెస్ ఆధారంగా ఉండాలి’ అని అభిప్రాయపడ్డారు. ‘మేము(ఆర్జేడీ) బిహార్‌కే పరిమితమైనట్టు, మరికొన్ని పార్టీలు ఆయా రాష్ట్రాలకే పరిమితంగా ఉన్నాయి. మనమంతా ఏకమై, అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటించాలి. తరచూ ప్రజల్లో మెలగాలి. బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన హామీలేంటీ, ఎన్ని నెరవేర్చింది.. అన్న అంశాలను ప్రజలకు తెలియజేయాలి. మరింతకాలం బీజేపీనే అధికారంలో ఉంటే దేశంలో ఏమీ మిగలదన్న విషయాన్ని వాళ్లకు అర్థమయ్యేలా వివరించాలి’ అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed