- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఎంత పని చేశాడో తెలుసా

దిశ, కామారెడ్డి : భార్య కాపురానికి రావడం లేదని మనోవేదన చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, మృతుని సోదరుడు యాదగిరి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరానగర్ కాలనీకి చెందిన బోదాసు రాజు (35)కు 13 సంవత్సరాల కిందట లక్ష్మీ అనే మహిళతో వివాహం జరిగింది.
వారికి ఇద్దరు సంతానం కలగగా ఆ తర్వాత సంసార విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలతో అతని భార్య లక్ష్మి అతన్ని వదిలి తల్లి ఇంటి వద్దనే ఉంటుంది. దీంతో మద్యానికి బానిస అయిన రాజు ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం గమనించిన అతని అన్న యాదగిరి తన తమ్ముడు రాజు అతని భార్య కాపురానికి రావడం లేదనే ఉద్దేశంతో జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకొని చనిపోయినట్లుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు.