కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే పేదలకు సన్న బియ్యం : ఎమ్మెల్యే

by Sumithra |
కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే పేదలకు సన్న బియ్యం : ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే పేదలకు సన్న బియ్యం సరఫరా జరుగుతున్నదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ రూరల్ మండలం చిట్యాల, దిలావార్ పూర్, సారంగాపూర్ మండల కేంద్రాల్లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా రాష్ట్రంలోని పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలుగా కరోనా సమయం నుంచి దేశ వ్యాప్తంగా ఉచిత బియ్యం పంపిణీకి సహకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రాంనాథ్ , సత్యనారాయణ గౌడ్, ముత్యం రెడ్డి, వీరేష్, జమాల్, మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నర్సారెడ్డి, నరేష్, నాయకులు మౌలానా, చంద్ర ప్రకాష్ గౌడ్, విలాస్, రాజా రెడ్డి, రాజేశ్వర్, వీరయ్య, సాగర్ రెడ్డి, గంగారెడ్డి, లింగారెడ్డి, తిరుమల చారి, శేఖర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed