పల్లా రాజేశ్వర్ రెడ్డి 100 కోట్లకు బొంద పెడతాం : తీన్మార్ మల్లన్న

by Anukaran |   ( Updated:2021-03-17 21:50:33.0  )
పల్లా రాజేశ్వర్ రెడ్డి 100 కోట్లకు బొంద పెడతాం : తీన్మార్ మల్లన్న
X

దిశ వెబ్ డెస్క్: నల్లగొండ-వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభుత్వం, అధికార పార్టీ పెట్టిన డబ్బులకు – ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నాయని ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. తాను తొలినుంచి చెబుతున్నట్లుగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి తీన్మార్ మల్లన్నకు మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. మొదటి రౌండ్ పూర్తయి రెండో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుందని.., కౌంటింగ్ చూస్తే పల్లారాజేశ్వర్ రెడ్డి ఓటమి ఖాయం. ఈ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న వందకు రెండొందల శాతం గెలవబోతున్నాడు. మొదటి, రెండు రౌండ్లలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టిపోటీ ఇచ్చాం. మొత్తం 7 రౌండ్ల కౌంటింగ్ ముగిసే సమయానికి విజయం సాధిస్తాం. పల్లా రాజేశ్వర్ రెడ్డి పెట్టిన వందకోట్లను బొందపెడతామని తీన్మార్ మల్లన్న ధీమా వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో రెండో స్థానం లీడింగ్ లో కొనసాగడంపై తీన్మార్ మల్లన్న స్పందించారు. తనపై ప్రజల విశ్వాసం, నమ్మకమే రాష్ట్రా స్థాయి పార్టీల నుంచి జాతీయ స్థాయి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తన వెంటపడేలా చేశాయని అన్నారు.

Advertisement

Next Story