- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ పనిచేస్తుండగా పేలిన తుపాకీ.. యువకుడికి తీవ్రగాయాలు

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొనాపూర్ గ్రామంలో నాటు తుపాకీ కలకలం రేపింది. నాటు తుపాకీ మిస్ ఫైర్ కావడంతో కుల్దీప్ (25) అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. అడవి పందుల వేట కోసం తుపాకీ తయారీ చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. తుపాకీ పేలిన ఘటనలో గాయపడ్డ కుల్దీప్ ను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కుల్దీప్ ని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాన్సువాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. బాన్సువాడ మండలం కొనాపూర్ గ్రామం ఒకప్పుడు అన్నల ఇలాకా. అక్కడ చాలా మంది వేట కోసం నాటు తుపాకులు కలిగి ఉన్నారు అనేది బహిరంగ రహస్యమే.
Next Story