యూట్యూబ్ నుంచి మరో సరికొత్త ఫీచర్!

by Nagaya |
యూట్యూబ్ నుంచి మరో సరికొత్త ఫీచర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: యూజర్లను ఆకర్షించేందుకు తరచూ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్న గూగుల్ కు చెందిన యూట్యూబ్ ఇప్పుడు విద్యారంగంలోకి అడుగుపెట్టబోతోంది. త్వరలో 'యూట్యూబ్ లెర్నింగ్' పేరుతో కోర్సులను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. ఆన్ లైన్ కోర్సులకు ఆధరణ పెరుగుతుండటంతో సబ్ స్క్రిప్షన్ విధానంలో యూట్యూబ్ కోర్సులను ఆఫర్ చేయబోతోంది. ఈ మేరకు అధ్యాపకులు మరియు అభ్యాసకులకు వీడియో సేవను మరింత ఆకర్షణీయంగా చేయడానికి కంటెంట్ క్రియేటర్లకు మరిన్ని మానిటైజేషన్ మార్గాలను అందించడానికి విస్తృత చర్యలు తీసుకుంటున్నట్లు యూట్యూబ్ సోమవారం ప్రకటించింది. సోమవారం నాడు జరిగిన వార్షిక భారత సదస్సులో గూగుల్ కోర్సులను ఆవిష్కరించింది.

ఈ సేవలు ప్రస్తతం బీటా వెర్షన్ లో అందుబాటులోకి రాగ 2023 మొదటి ఆరు నెలల్లో అందరికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం నిపుణులు అందించే కంటెంట్ యూట్యూబ్ సిద్ధం చేయబోతోంది. చందా చెల్లించడం ద్వారా ఈ కోర్సులను యాడ్స్ లేకుండా నేర్చుకునే అవకాశం ఉంటుంది. యూట్యూబ్ కోర్సుల ఆవిష్కరణ విషయాన్ని గూగుల్ అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ యూట్యూబ్ ఎండీ ఇషాన్ జాన్ ఛటర్జీ అనధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తొలుత భారత్, దక్షిణ కోరియా, అమెరికాలో యూట్యూబ్ కోర్సులు ప్రారంభం అవుతాయని చెప్పారు.

ఈ విధానం అమలులోకి వస్తే ఇప్పటికే ఆన్ లైన్ కోర్టులు అందిస్తున్న బైజూస్, అన్ అకాడమీ, ఆకాశ్, వంటి సంస్థలకు గట్టి పోటీ ఎదురుకానుంది. యూట్యూబ్ దాదాపు ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉంటుంది. దీని వల్ల ప్రజలు ఈ యాప్ ను ఇప్పటికే ఇతర కంటెంట్ కోసం సులువుగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే యూట్యూబ్ లెర్నింగ్ సేవలు ఏమేరకు ప్రజాధరణ పొందుతుందో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed