WhatsApp :వాట్సాప్ ద్వారా ఒకేసారి 100 మీడియా ఫైల్స్ షేరింగ్

by Harish |   ( Updated:2023-02-08 16:06:42.0  )
WhatsApp :వాట్సాప్ ద్వారా ఒకేసారి 100 మీడియా ఫైల్స్ షేరింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి త్వరలో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు మెటా యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇతరులకు గరిష్టంగా ఒకేసారి 100 మీడియా ఫైల్స్‌ను షేర్ చేయడానికి అనుమతించే కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. గతంలో ఇది 30 కి పరిమితంగా ఉండేది. కానీ రోజు రోజుకు వినియోగదారులకు పెరుగుతున్న అవసరాల ద‌ృష్ట్యా ఒకేసారి పెద్ద మొత్తంలో ఫైల్స్‌ను ఇతరులకు షేర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని ద్వారా సమయం ఆదా అవ్వడమే కాకుండా, ఒకే ఫొటో లేదా వీడియోలను ఒకటి కంటే ఎక్కువసార్లు షేర్ చేయకుండా ఇది సహాయపడుతుంది.

ఈ ఫీచర్‌ను, బీటా వినియోగదారులకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే చాట్‌లలో 100 మీడియా ఫైల్స్ వరకు షేర్ చేయగల సామర్థ్యం కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. త్వరలో మిగతా వినియోగదారులకు ఈ ఫీచర్‌ను విడుదల చేయనున్నారు.

Advertisement

Next Story