- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
New Prepaid Plan: చీప్ అండ్ బెస్ట్ ప్లాన్.. రూ.209కే ఫ్రీ కాల్స్.. ఇంకా ఎన్నో.. ఓ లుక్కేయండి

దిశ,వెబ్‌డెస్క్: Vodafone-Idea: ఇటీవల కాలంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు జియో(Jio), ఎయిర్ టెల్(Airtel) రీఛార్జ్ ప్లాన్స్ ను భారీగా పెంచాయి. దీంతో వినియోగదారులపై మరింత భారం పడింది. అయితే వొడాఫోన్ ఐడియా(Vodafone-Idea) తన వినియోగదారుల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్(New Prepaid Plan) ప్రారంభించింది. కొత్త ప్లాన్(New Plan) రూ. 209 తో కంపెనీ 28 రోజుల వ్యాలిడిటితో తీసుకువచ్చింది. ఈ ప్లాన్ లో మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం మొత్తం 2జీబీ డేటాను పొందుతారు. అంతేకాదు 300 వరకు ఫ్రీ ఎస్ఎంఎస్(Fee SMS) లు, అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్(Unlimited calling benefits) పొందుతారు. ఇందులో అందించే బెనిఫిట్స్ రూ. 199ప్లాన్ కు సమానంగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటంటే రూ. 209 ప్లాన్ లో కంపెనీ అన్ లిమిటెడ్ కాలర్ ట్యూన్స్ ను అందిస్తోంది.
రూ. 218 ప్లాన్
కంపెనీ రూ. 218 ప్లాన్ ఒక నెల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ లో మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం మొత్తం 3GB డేటాను పొందుతారు. డేటా పరిమితి ముగిసిన తర్వాత మీరు 1 GB డేటా కోసం 50 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ప్లాన్ లో కంపెనీ అన్ లిమిటెడ్ కాలింగ్ , 300 ఫ్రీ ఎస్ఎంఎస్ లు అందిస్తోంది. 300 ఎస్ఎంఎస్ లు వ్యాలిడిటీ ముగిసిన తర్వాత కంపెనీ ప్రతి ఎస్ఎంఎస్ కు రూ. 1 ఎస్టీడీ ఎస్ఎంఎస్ కోసం రూ. 1.5 వసూలు చేస్తుంది.
రూ. 249 ప్లాన్ లో
ఈ ప్లాన్ 24రోజులపాటు చెల్లుబాటులో ఉంటుంది. దీనిలో మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం ప్రతిరోజూ 1GB డేటా ఫ్రీగా పొందుతారు. డేటా వ్యాలిడిటీ ముగిసిన అనంతరం ప్లాన్ లో అందించే ఇంటర్నెట్ స్పీడ్ 64కేహెచ్ బీపీఎస్ కి తగ్గుతుంది. ఈ ప్లాన్ లో కంపెనీ ప్రతిరోజూ 100ఎస్ఎంఎస్ లను అందిస్తోంది. దీంతోపాటు మీరు అన్ లిమిటెడ్ కాలింగ్ కూడా పొందుతారు.
40 రోజులపాటు అన్ లిమిటెడ్
వొడాఫోన్ -ఐడియా(Vodafone-Idea) కు చెందిన ఈ అన్ లిమిటెడ్ ప్లాన్ ధర రూ. 289. ఇందులో 4GB డేటా కూడా ఉంటుంది. డేటా లిమిట్ ముగిసిన తర్వాత మీరు 1GB డేటా కోసం 50పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ 600 ఫ్రీ ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ తో వస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీ 40రోజులు ఉంటుంది.