అత్యాధునిక ఫీచర్స్‌తో Vivo నుంచి రెండు స్మార్ట్ ఫోన్‌లు

by Harish |   ( Updated:2023-04-26 13:36:21.0  )
అత్యాధునిక ఫీచర్స్‌తో Vivo నుంచి రెండు స్మార్ట్ ఫోన్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: Vivo కంపెనీ భారత్‌లో రెండు స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేసింది. వీటి పేరు ‘Vivo X90, Vivo X90 Pro’. ఈ రెండు ఫోన్‌లు కూడా ఇప్పుడు ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. Vivo X90 మోడల్ 8GB RAM, 128GB స్టోరేజ్ ధర రూ. 59,999. 12GB RAM, 256GB వేరియంట్ ధర రూ. 63,999. అదే Vivo X90 Pro మోడల్ మాత్రం ఒకే స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. దీని 12GB RAM, 256GB స్టోరేజ్ ధర రూ రూ.84,999. కొనుగోలు సమయంలో HDFC, ICICI బ్యాంక్ కార్డ్‌లపై రూ. 8,000 తగ్గింపు కూడా ఉంది. ఈ రెండు ఫోన్లు మే 5న ఫ్లిప్‌కార్ట్, వివో స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.


Vivo X90 స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ టెక్నాలజీ, 2,800 x 1,260-పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అదే, ప్రో మోడల్ కూడా ఇదే విధమైన ఫీచర్లను కలిగి ఉంది. కానీ ఇది 2K రిజల్యూషన్‌తో వస్తుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు MediaTek డైమెన్సిటీ 9200 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ 13-ఆధారిత FunTouch OS కస్టమ్ స్కిన్‌లో రన్ అవుతాయి. బ్యాటరీ పరంగా Vivo X90 మోడల్ 120W ఫాస్ట్ చార్జింగ్‌‌తో 4,810mAh బ్యాటరీని కలిగి ఉంది, అదే ప్రో మోడల్‌లో 120W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్‌కు సపోర్ట్‌తో 4,870mAh బ్యాటరీని కలిగి ఉంది.


Vivo X90 మోడల్‌లో బ్యాక్ సైడ్ 50MP+12MP+12MP కెమెరాలు ఉన్నాయి. అదే సెల్ఫీల కోసం ముందు 32MP కెమెరా ఉంది. Vivo X90 Pro మోడల్‌లో 50MP+50MP+12MP కెమెరాలు, సెల్ఫీల కోసం ముందు 32MP కెమెరాను అందించారు.

Next Story