Tech News: యాపిల్ లవర్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ఐఫోన్-16 సిరీస్ విడుదలకు డేట్ ఫిక్స్

by Shiva |
Tech News: యాపిల్ లవర్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ఐఫోన్-16 సిరీస్ విడుదలకు డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ -16 సిరీస్ కోసం ఎదురుచూస్తున్న టెక్ లవర్స్‌కు ఆ సంస్థ ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు సెప్టెంబర్ 9న యాపిల్-16 సిరీస్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. కాలిఫోర్నియా రాష్ట్రం కుపెర్టినోలోని యాపిల్ పార్క్‌లో గల స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఈవెంట్‌ను జరగనుంది. ‘యాపిల్ ఇట్స్ గ్లో టైమ్’ అనే ట్యాగ్‌లైన్‌తో పలు మీడియా సంస్థలకు కంపెనీ ఇన్విటేషన్ కార్టులకు కూడా పంపింది. ప్రతి సంవత్సరం ఏదో కొత్త ఫ్యూచర్‌తో ఫోన్లను లాంఛ్ చేసినట్లుగానే.. ఈ సారి ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను విడుదల చేయనున్నారు. అందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అనే నాలుగు రకాల మోడల్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఆ ఫోన్లను వాడినట్లుగా కంపెనీ తెలిపింది. ఇక ధరల విషయానికి వస్తే.. ఐఫోన్ 16 బేస్ మోడల్ ధర (128 GB) రూ.67,100, 16 ప్లస్ రూ.75,500, 16 ప్రో మ్యాక్స్ రూ.1,00,700లుగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక ఐఫోన్ 16, 16 ప్లస్ మోడల్ ఫోన్లు యాపిల్ A18 చిప్ సెట్‌తో రాబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంటెలిజెన్స్ ఫీచర్స్, ఐఫోన్ 15 సిరీస్‌తో కంపేర్ చేస్తే 16 మోడల్ డిస్‌ప్లే సైజ్ 0.2 అంగుళాలు పెద్దగా ఉండనుంది. బ్యాటరీ సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. 16 మోడల్ సిరీస్ యాపిల్ వచ్చే నెలలో విడుదల చేసేందుక ప్లాన్ చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed