- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
OTP Scams: బ్యాంకు కస్టమర్లకు అలెర్ట్.. ఆ లింక్‌లపై క్లిక్ చేయొద్దు

దిశ, వెబ్ డెస్క్: OTP Scams: ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోయాయి. ఆన్ లైన్ లో లెక్కకు మించి మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఓటీపీ స్కామ్స్ కు తెరతీశారు. మీ ఫోన్ నెంబర్ కు ఓటీపీ పంపించి.. ఆ ఓటీపీ తెలుసుకుని ఆన్ లైన్ లో మీ డబ్బులు కాజేస్తారు. అయితే కొన్ని పద్దతుల ద్వారా ఓటీపీ స్కామ్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఎలాగో చూద్దాం.
ఓటీపీ మోసాలు ఈ రోజుల్లో చాలా సాధారణంగా మారాయి. మీ బ్యాంక్ అకౌంట్స్, ఆన్ లైన్ వాలెట్స్ లేదా వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే మీ అకౌంట్ లోని సొమ్మంతా మోసగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. ఈ మోసాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.
ఓటీపీ ఎవరికీ షేర్ చేయోద్దు
బ్యాంక్ అధికారి, కస్టమర్ కేర్ ఏజెంట్ లేదా ఎవరైనా ఫోన్ లో ఓటీపీ అడిగితే చెప్పకూడదు. బ్యాంకులు లేదా నిజమైన సంస్థలు ఎప్పుడూ ఓటీపీ కోసం కాల్ చేయవు. అందుకే మీ ఓటీపీ ఎవరితోనూ షేర్ చేయవద్దు.
అనుమానాస్పద కాల్స్ కు స్పందించకూడదు
మీ ఖాతా బ్లాక్ అయ్యింది లేదా రివార్డు వచ్చింది ఓటీపీ చెప్పండి అంటూ కాల్స్ వస్తే జాగ్రత్త పడాల్సిందే. వెంటనే ఫోన్ పెట్టేయండి. నిజమైన సమస్య ఉంటే బ్యాంక్ అధికారిక లేదా వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవడం బెటర్
లింక్స్ పై క్లిక్ చేయకూడదు
ఓటీపీ కోసం వచ్చిన మెసేజ్ లో ఏదైనా లింక్ ఉంటే దాన్ని తాకకూడదు. మోసగాళ్లు ఫేక్ లింక్స్ ద్వారా మీ ఫోన్ లోకి చొరబడి సమాచారం దొంగలించే అవకాశం ఉంది. లింక్ క్లిక్ చేయకుండా ఓటీపీని మాన్యువల్ గా ఎంటర్ చేయండి.
స్క్రీన్ షేరింగ్ యాప్స్ కు దూరం
మీ సమస్యను సాల్వ్ చేస్తాం అంటూ ఎనీ డెస్క్, టీమ్ వ్యూవర్ లాంటి యాప్స్ డౌన్ లోడ్ చేయమని అడిగితే వినికూడదు. మీ ఫోన్ ను పూర్తిగా మోసగాళ్ల చేతుల్లోకి ఇచ్చినట్లే.
మీ ఫోన్ ను సేఫ్ గా ఉంచండి
ఫోన్ లో లాక్ సెట్ చేసుకోండి. పాస్ వర్డ్ లేదా ఫింగర్ ప్రింట్ ఉపయోగించండి. ఓటీపీ మెసేజ్ లు ఎవరి చేతికి చిక్కకుండా చూసుకోండి.
మోసం జరిగితే రిపోర్ట్ చేయండి
ఒకవేళ మీ ఓటీపీ దొంగలకు చిక్కి, డబ్బు పోయినట్లు అనిపిస్తే వెంటనే మీ బ్యాంకుకు ఫోన్ చేసి ఖాతాను బ్లాక్ చేయండి. లేదంటే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి.
తాజాగా భారత్ లో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సెస్ బ్యాంక్, యూజర్ల భద్రతను మెరుగుపరచడానికి ఓటీపీ సంబంధిత మోసాల నుంచి కస్టమర్లను కాపాడేందుకు కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఓపెన్ యాప్ లో తొలిసారి ఇన్ యాప్ మొబైల్ ఓటీపీ సౌలభ్యాన్ని ప్రారంభించింది. ఈ సరికొత్త సౌలభ్యం ఎస్ఎంఎస్ ద్వారా ఓటీపీ పంపే బదులు, నేరుగా సమయ ఆధారిత పాస్ వర్డులను క్రియేట్ చేస్తూ టెలికాం నెట్ వర్క్ లపై ఆధారపడే అవసరాన్ని తొలగించింది.