‘సోషల్‌ మీడియా’కు కాసులు కురిపిస్తున్న ఏజ్ గ్రూప్ ఇదే

by Hajipasha |
‘సోషల్‌ మీడియా’కు కాసులు కురిపిస్తున్న ఏజ్ గ్రూప్ ఇదే
X

దిశ, నేషనల్ బ్యూరో : ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఏదైనా కావచ్చు.. వాటికి ప్రధాన ఆదాయ మాధ్యమంగా ఉన్నది మాత్రమే యూతే !! ఈవిషయం అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఉన్న ‘హార్వర్డ్‌ టీహెచ్‌ చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌’ అధ్యయనంలో వెల్లడైంది. దీని ప్రకారం.. 2022 సంవత్సరంలో అమెరికాలోని 18 ఏళ్ల లోపు యూజర్ల ద్వారా సోషల్ మీడియా కంపెనీలకు రూ.91,541 కోట్ల యాడ్స్ ఆదాయం వచ్చింది. 12 ఏళ్లలోపు పిల్లల వల్ల రూ.17,476 కోట్ల ప్రకటనల రాబడి దక్కింది. స్నాప్‌చాట్, టిక్‌టాక్, యూట్యూబ్‌‌లకు వచ్చే యాడ్స్ ఆదాయంలో దాదాపు 30 నుంచి 40 శాతం యువ యూజర్ల వ్యూస్ నుంచే లభిస్తున్నాయని స్టడీ రిపోర్టు చెప్పింది.

ఆదాయం తీరుతెన్నులు ఇవీ..

అమెరికాలో సోషల్ మీడియా కంపెనీలకు వచ్చిన మొత్తం ప్రకటనల ఆదాయంలో స్నాప్‌చాట్‌‌‌కు ‌అత్యధికంగా 41 శాతం, టిక్‌టాక్‌‌కు 35 శాతం, యూట్యూబ్‌‌కు 27 శాతం, ఇన్‌స్ట్రాగామ్‌‌కు 16 శాతం దక్కింది. 13–17 ఏళ్ల లోపు యూజర్ల నుంచి వచ్చిన యాడ్స్ ఆదాయంలో మొదటి ప్లేస్‌లో నిలిచిన టిక్‌టాక్‌‌కు రూ.16,644 కోట్లు, రెండో ప్లేస్‌లో నిలిచిన యూట్యూబ్‌కు రూ.9,986 కోట్లు లభించాయి. 12 ఏళ్లలోపు యూజర్ల నుంచి లభించిన యాడ్స్ ఆదాయంలో నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచిన యూట్యూబ్‌‌కు రూ.7,983 కోట్లు, రెండో ప్లేస్‌లో నిలిచిన ఇన్‌స్ట్రాగామ్‌‌కు రూ.6,676 కోట్లు, మూడో ప్లేస్‌లో నిలిచిన ఫేస్‌బుక్‌‌కు రూ.1,140 కోట్లు వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed