రూ. 10,000 తగ్గింపుతో లభిస్తున్న Realme స్మార్ట్‌ఫోన్

by Harish |
రూ. 10,000 తగ్గింపుతో లభిస్తున్న Realme స్మార్ట్‌ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో రానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్-2023 సేల్‌‌కు ముందు ‘Realme GT నియో 3T’ స్మార్ట్ ఫోన్ ధర భారీగా తగ్గింది. సెప్టెంబర్ 2022 లో ఇండియాలో లాంచ్ అయినప్పుడు ఈ ఫోన్ ధర రూ. 29,999 ఉండగా, ఇప్పుడు రూ. 10,000 తగ్గింపుతో రూ. 19,999లకే ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఉంది. GT నియో 3T ఫోన్ 6.62-అంగుళాల E4 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 870 SoC ద్వారా పనిచేస్తుంది. మొదట్లో Android 12తో వచ్చినప్పటికి డిసెంబర్‌లో Android 13-ఆధారిత Realme UI 4.0కి అప్‌డేట్ అయింది. ఫోన్ బ్యాక్ సైడ్ 64MP+8MP+2MP కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు 16MP కెమెరా ఉంది. ఇది 80W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 12 నిమిషాల్లో ఫోన్‌ను 50 శాతానికి చార్జ్ చేయగలదని Realme పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed