'పి ' సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదల చేసిన రియల్‌మీ

by S Gopi |
పి  సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదల చేసిన రియల్‌మీ
X

దిశ, టెక్నాలజీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ తన 'పి ' సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. పి1 5జీ, పి1 ప్రో 5జీ పేర్లతో తీసుకొచ్చిన ఈ ఫోన్లు మిడ్-రేంజ్ విభాగంలో అందుబాటులో ఉన్నాయి. వాటిలో పి1 5జీ 6జీబీ, 128జీబీ రూ. 15,999తో లభిస్తుండగా, 8జీబీ, 256జీబీ వేరియంట్ రూ. 18,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే, పి1 ప్రో 5జీ కూడా 8జీబీ, 128జీబీ వేరియంట్ రూ. 21,999గా, 8జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ. 22,999గా ఉంది. ప్రత్యేక ఆఫర్ కింద ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ. 2,000 తగ్గింపు ఉంటుందని, ఏప్రిల్ 30 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు మొదలవుతాయని రియల్‌మీ ఇండియా వెల్లడించింది. ఫీచర్లకు సంబంధించి ఈ ఫోన్‌లు 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్‌డ్ డిస్‌ప్లే, వెనుక 50ఎంపీ సోనీ కెమెరా, 2ఎంపీ సెకండరీ కెమెరా వంటివి ఉన్నాయి. పి1 స్మార్ట్‌ఫోణ్ డైమెన్‌సిటీ 7050 ప్రాసెసర్‌తో వస్తుండగా, పి1 ప్రో స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్‌తో లభిస్తుంది. 5,000 ఎంఏహెచ్ మ్యాటరీ 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెండేళ్ల ఓఎస్ అప్‌డేట్, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనున్నట్టు కంపెనీ పేర్కొంది.

Advertisement

Next Story