ఒకే యాప్.. పదుల సేవలు.. ఆకట్టుకుంటున్న ‘రైల్వే’ యాప్ (వీడియో)

by Bhoopathi Nagaiah |
ఒకే యాప్.. పదుల సేవలు.. ఆకట్టుకుంటున్న ‘రైల్వే’ యాప్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : రైల్ కనెక్ట్, రైల్ మదద్, యూటీఎస్, సటార్క్, టీఎమ్‌సీ-నిరీక్షన్, ఐఆర్‌సీటీసీ ఎయిర్, పోర్ట్‌రీడ్‌... ఒక్క ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని ఆ రైల్ ఎక్కాలంటే కనీసం వీటిలో నాలుగైదు యాప్స్ యూజ్ చేయాల్సిందే. ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఐఆర్‌సీటీసీ యాప్‌ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత పీఎన్‌ఆర్ చెక్ చేసుకోవడానికి ఇంకో వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. చివరిగా ట్రైన్ లైవ్ లొకేషన్ తెలుసుకోవడానికి ఇంకో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అంటే ఒక్క పని కోసం ఇన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆలోచించండి ఎంత తలనెప్పో ఇదంతా. కానీ ఇకపై ఈ ప్రాబ్లంకి చెక్ పెడుతూ.. ట్రైన్‌కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకేచోట దొరికేలా సరికొత్త ఐఆర్‌సీటీసీ సూపర్ అప్లికేషన్‌ని తీసుకురాబోతోంది రైల్వే డిపార్ట్‌మెంట్.

ఈ కొత్త సూపర్ అప్లికేషన్ ద్వారా ఇకపై ప్లాట్ ఫాం టికెట్ బుక్ చేసుకోవడం నుంచి ట్రైన్ లైవ్ స్టేటస్ వరకు మొత్తం చెక్ చేసుకోవచ్చట. అలాగే ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చని చెబుతోంది రైల్వే డిపార్ట్‌మెంట్. ఈ నెల చివరి కల్లా ఈ సూపర్ యాప్ అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతోంది. ఇప్పటి లెక్కల ప్రకారం.. ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌ను 10 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకొని యూజ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇదే టాప్ రైల్వే యాప్‌. ఇక మిగిలిన యాప్స్ కూడా కోట్ల మంది యూజ్ చేస్తున్నారు.

అయితే ఇన్ని యాప్స్ యూజ్ చేయాల్సి రావడంపై చాలామంది ట్రావెలర్స్ విసిగిపోతున్నారని రైల్వే డిపార్ట్‌మెంట్‌కి అర్థమైంది. ఇక ఇప్పటికే టెక్నాలజీని యూజ్ చేసుకోవడంలో దూసుకుపోతున్న రైల్వే డిపార్ట్‌మెంట్.. ఈ ప్రాబ్లంకి కూడా చెక్ పెట్టాలనే ఆలోచనతో ఈ యాప్‌లన్నింటిని సేవలను ఒకే సూపర్ యాప్ ద్వారా అందించాలని డిసైడ్ అయి సరికొత్త ఆల్ ఇన్ వన్ యాప్‌ని రెడీ చేసింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్... CRIC డెవలప్ చేస్తున్న ఈ సూపర్ యాప్‌ ఇప్పటికే కంప్లీట్‌ అయిందని, జస్ట్ IRCTCతో లింక్ చేయడం మాత్రం మిగిలి ఉందని తెలుస్తోంది. అంటే ఇంకొద్ది రోజుల్లో ఈ యాప్ మనందరికీ అందుబాటులోకి వస్తుందన్నమాట.

Advertisement

Next Story

Most Viewed