- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BSNL:కొత్త ప్లాన్లను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్..బెనిఫిట్స్ అదుర్స్!
దిశ,వెబ్‌డెస్క్:ఇటీవల ప్రైవేటు రంగ టెలికాం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో(JIO), భారతీ ఎయిర్‌టెల్(Bharti Airtel) ప్లాన్ల రేట్లను అమాంతం పెంచిన సంగతి తెలిసిందే. దాదాపు 15 శాతం మేర పెంచడం జరిగింది. అప్పటి నుంచి చాలా మంది యూజర్లు ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ ఐనా BSNL వైపు చూస్తున్నారు. అయితే BSNLకు ఎందుకు ఇంతటి ఆదరణ వస్తుందంటే..తక్కువ ధరలకే చక్కటి ప్రయోజనాలు అందించే ఆఫర్లు అందుబాటులో ఉండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా BSNL కూడా ఆకర్షణీయమైన కొత్త ఆఫర్లు పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఇటీవల మరో రెండు కొత్త ప్లాన్లను కంపెనీ విడుదల చేసింది. రూ.108, రూ.249 ధరలతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను BSNL ప్రకటించింది.
రూ.108 ప్లాన్ వివరాలివే..
తక్కువ ధరకు రూ.108 ప్లాన్‌లో కస్టమర్లు(customers) 28 రోజుల పాటు దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్(Unlimited calling) చేసుకోవచ్చు. నేషనల్ రోమింగ్‌ను కూడా ఈ ప్లాన్ కవర్ చేస్తుంది. అంతేకాదు 1GB హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో ఉచిత SMS ప్రయోజనం అందుబాటులో లేదు.
రూ. 249 రీఛార్జ్ బెనిఫిట్స్ ఇవే..
ఈ ప్లాన్ వ్యాలిడిటీ(Plan validity) 45 రోజులుగా ఉంటుంది. నేషనల్ రోమింగ్(National Roaming)తో పాటు దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా(network) అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఉచిత(Free) SMSలను కూడా పొందవచ్చు. అంతేకాదు 2GB హై-స్పీడ్ డేటా(Data) పొందవచ్చు.