- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడ్జెట్ ధరలో జీ34 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన మోటోరోలా
దిశ, టెక్నాలజీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా మంగళవారం తన కొత్త మోడల్ మోటో జీ34 5జీ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఓషన్ గ్రీన్, ఐస్ బ్లూ, చార్‌కోల్ బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి తెచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ 3డీ యాక్రిలిక్ గ్లాస్ ఫినిషింగ్‌తో వస్తుంది. 4జీబీ, 8జీబీ వేరియంట్లలో వచ్చిన ఈ ఫోన్ 128జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ. 10,999, రూ. 11,999గా నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్‌కు అవకాశం కల్పించారు. జనవరి 17 నుంచి మోటోరోలా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో అందరికీ అందుబాటులోకి రానుంది. ప్రారంభంలో రూ. 1000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇవ్వనున్నట్టు కంపెనీ తెలిపింది. ఫీచర్లకు సంబంధించి, 4జీబీ ర్యామ్‌తో వచ్చే స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ, 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ కెమెరా, 2ఎంపీ మైక్రో లెన్స్‌తో వస్తుంది. సైన్ క్యాప్చర్, స్మైల్ క్యాప్చర్, ఆటో నైట్ విజన్ మోడ్ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో 20వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలిగి ఉంది. 8జీబీ వేరియంట్ సైతం ఇవే ఫీచర్లతో వస్తుంది.