- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్ సిరీస్‌లో కొత్త ట్యాబ్ విడుదల చెసిన లెనొవొ
దిశ, టెక్నాలజీ: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల బ్రాండ్ లెనొవొ తన ఎమ్ సిరీస్‌లో కొత్త ట్యాబ్ మోడల్‌ను విడుదల చేసింది. లెనొవొ ట్యాబ్ ఎమ్11 పేరుతో తీసుకొచ్చిన ఈ మోడల్‌లో రెండు ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో పాటు నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఎమ్ సిరీస్‌లో సరికొత్తగా వచ్చిన ఈ ట్యాబ్ రెండు వేరియంట్లలో లభిస్తుండగా, 4జీబీ, 128జీబీ వేరియంట్ ధరను రూ. 14,900గా నిర్ణయించారు. 8జీబీ, 128జీబీ వేరియంట్ ధర వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకానికి తీసుకొస్తామని లెనొవొ ప్రకటించింది. భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చే తేదీపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆండ్రాయిడ్ 13తో వచ్చిన ఎమ్11 ట్యాబ్, 7,040 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వెనుక 13ఎంపీ కెమెరా, ముందువైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఎస్‌డీ కార్డును 1 టీబీ వరకు పెంచుకోవచ్చని కంపెనీ చెబుతోంది. అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఎమ్11 ట్యాబ్‌లో మల్టీ టాస్కింగ్ సౌకర్యం ఉంది. ఒకే సమయంలో ఏదైనా సినిమా, వీడియో చూస్తూ నోట్స్ రాసుకునే సదుపాయం ఉంటుంది. ఈ ట్యాబ్‌కు పెన్ సపోర్ట్ ఉన్నప్పటికీ వేరుగా కొనాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.