కార్ లోగోల వెనుకాల ఇంత స్టోరీ ఉందా?

by GSrikanth |
కార్ లోగోల వెనుకాల ఇంత స్టోరీ ఉందా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఇంట్లో కారు ఉండటం సర్వసాధారణం అయిపోయింది. కొందరు ఫ్యామిలీ మొత్తం ప్రయాణించేందుకు వీలుగా కొనుగోలు చేస్తుండగా.. మరికొందరు గొప్పలకు పోయి అప్పులు చేసి కార్లు కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు కారు కొనడం డ్రీమ్‌గా పెట్టుకుంటారు. అయితే, కార్లు, వాటి కంపెనీల లోగోల వెనుక దాగి ఉన్న రహస్య అందరికీ తెలిసి ఉండదు. కొన్ని లోగోల వెనుక అందమైన, ఆసక్తికరమైన విషయం దాగి ఉంటుంది. హ్యుండాయ్ కారు లోగో ఎఫ్ షేప్‌లో ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు హ్యాండ్ షేక్ చేసుకుంటుంటారు. ఆ ఇద్దరిలో ఒకరు కస్టమర్, మరొకరు కంపెనీ ప్రతినిధి.

మెర్సిడీస్‌లో మూడు యారో మార్క్స్ ఉంటాయి. గాలి, భూమి, నీరుని రిప్రజెంట్ చేస్తాయి. టయోటాలో మూడు ఓవెల్ షేప్‌లో ఉండే రింగ్స్ ఉంటాయి. ఇవి కస్టమర్ అండ్ కంపెనీ హార్ట్స్‌ కనెక్ట్ అయి ఉన్నట్లుగా ఉంటుంది. ఆడి కారులో ఉండే నాలుగు రింగులు నాలుగు కంపెనీలను రిప్రజెంట్ చేస్తాయి. అంతేకాదు.. ఆ లోగోలో ఉండే ప్రతీ రింగ్ వెనుక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. దీంతో కారు కంపెనీ ప్రతినిధుల తెలివికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.

Advertisement

Next Story