కొత్త ప్రాసెసర్‌తో విడుదలైన Infinix స్మార్ట్ 8

by Harish |   ( Updated:2024-01-14 11:44:55.0  )
కొత్త ప్రాసెసర్‌తో విడుదలైన Infinix స్మార్ట్ 8
X

దిశ, టెక్నాలజీ: స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Infinix ఇండియాలో తన స్మార్ట్ 8 స్మార్ట్‌ఫోన్‌ను కొత్త ప్రాసెసర్‌తో విడుదల చేసింది. పాత మోడల్‌లో Unisoc TSoC వెర్షన్ ఉపయోగిస్తుండగా, ఇప్పుడు దానిలో Mediatek Helio G36 SoC ప్రాసెసర్‌ని అందించారు. Infinix స్మార్ట్ 8 మోడల్ గత నవంబర్ నెలలో Unisoc TSoC వెర్షన్‌లో లాంచ్ అయింది. అయితే ఆపరేటింగ్‌ను మరింత వేగవంతం చేయడానికి ఈ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. దీని 4GB RAM + 64GB మోడల్‌లో ధర రూ.7,499. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది టింబర్ బ్లాక్, షైనీ గోల్డ్, రెయిన్‌బో బ్లూ, గెలాక్సీ వైట్ కలర్స్‌లలో లభిస్తుంది. కొనుగోలు సమయంలో ICICI బ్యాంక్ కార్డుపై తగ్గింపు లభిస్తుంది.

Infinix స్మార్ట్ 8 వేరియంట్ 6.6-అంగుళాల IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 90Hz. ఫోన్ ఆండ్రాయిడ్ 13 Go-ఆధారిత XOS 13 ద్వారా రన్ అవుతుంది. కెమెరాల విషయానికి వస్తే, ఫోన్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ముందు సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. స్టోరేజ్‌ను మెమరీ కార్డు ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. దీనిలో 10W చార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్‌కు ఉంటుంది. ఇంకా ఫేస్ అన్‌లాక్ సపోర్ట్‌ కూడా ఉంది.

Advertisement

Next Story

Most Viewed