దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ కోర్ట్.. ఆన్‌లైన్ న్యాయస్థానం ఎలా పని చేయనుంది..

by Sumithra |   ( Updated:2024-08-17 14:06:35.0  )
దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ కోర్ట్.. ఆన్‌లైన్ న్యాయస్థానం ఎలా పని చేయనుంది..
X

దిశ, ఫీచర్స్ : దేశంలోనే తొలి డిజిటల్ కోర్టు కేరళలోని కొల్లంలో ప్రారంభమైంది. ఇది నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ (NI యాక్ట్) కేసులను పరిష్కరించేందుకు రూపొందించారు. శుక్రవారం ఈ కోర్టును సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి ప్రారంభించారు. డిజిటల్ కోర్టులో ప్రాథమిక దాఖలు నుండి తుది నిర్ణయం వరకు అన్ని పనులు డిజిటల్‌గా జరుగుతాయి. అంతే కాకుండా ఇంకా ఈ డిజిటల్ కోర్టు ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కేరళలో ప్రారంభించిన దేశంలోని మొట్టమొదటి డిజిటల్ కోర్టుకు '24/7 ఆన్ కోర్ట్' అని పేరు పెట్టారు. కోర్టులో ఉన్న కేసుల విచారణ సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం విజయవంతమైతే, రాష్ట్రంలో మరిన్ని చోట్ల కోర్టులు ఏర్పాటు చేస్తారని సమాచారం.

డిజిటల్ కోర్టు ఏ కేసుల పై తీర్పును ఇస్తుంది ?

డిజిటల్ కోర్ట్ '24/7 ఆన్ (ఓపెన్ అండ్ నెట్‌వర్క్డ్) కోర్ట్' ప్రారంభంలో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద కేసులను నిర్వహిస్తుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ అనేది ప్రామిసరీ నోట్‌లు, మార్పిడి బిల్లులు, చెక్కులకు సంబంధించిన చట్టం. ఎన్ ఐ యాక్ట్ పెండింగ్ లో ఉన్న మొత్తం కేసుల్లో చెక్ బౌన్స్ కేసులు పది శాతం ఉన్నాయని ఈ సందర్భంగా హైకోర్టు అధికారులు తెలిపారు. ఎన్‌ఐ యాక్ట్‌ కేసుల డిజిటల్‌ కోర్టు చెక్‌ బౌన్స్‌ కేసుల పై ఒకే విధానంలో పోలీస్‌ స్టేషన్లు, బ్యాంకులను అనుసంధానం చేసి తీర్పు ఇస్తుందని జస్టిస్‌ గవాయ్‌ తెలిపారు.

NI చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం చెక్ బౌన్స్ నేరం. అంటే రూ.20,000 చెక్కును ఎవరికైనా ఇస్తే, అవతలి వ్యక్తి బ్యాంకులో డిపాజిట్ చేయగా, మీ బ్యాంకు ఖాతాలో అంత మొత్తం లేదని తేలింది. కాబట్టి ఇందులో మీరు ఇచ్చిన చెక్కు తిరస్కరిస్తుంది. దానిని చెక్ బౌన్స్ అంటారు. అలా చేయడం NI చట్టం 1881 ప్రకారం శిక్షార్హమైన నేరం. నేరం రుజువైతే, శిక్ష చెక్కు మొత్తానికి రెట్టింపు జరిమానా లేదా గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు.

కోర్టు వ్యవస్థలో సాంకేతికత ఎలా విలీనం చేశారు ?

సాంకేతికతను కోర్టుకు అనుసంధానించడం ద్వారా ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా విజయరాఘవన్ వి అన్నారు. 'డిజిటల్ కోర్టులో సరైన సమయానికి విచారణ జరిగేలా స్మార్ట్ షెడ్యూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఫిర్యాదుదారులకు వారి కేసుల నిజ - సమయ స్థితిని చూపడం ద్వారా వారికి సహాయపడుతుంది. అంతేకాకుండా బ్యాంకులు, పోలీసు వంటి ముఖ్యమైన సంస్థలతో కోర్టు అనుసంధానిస్తుంది. తద్వారా సమాచార మార్పిడి సులభం అవుతుంది. కొన్ని నివేదికల ప్రకారం డిజిటల్ కోర్టులో నాలుగు APIలు (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌లు) ఉంటాయి. ఇవి కేసు స్థితి, దాని మెటాడేటా, ఆదేశాలు, తీర్పులను కవర్ చేస్తాయి. వచ్చే నెలలో కోర్టు ఆన్‌లైన్‌లో ప్రారంభం కాగానే ఈ వ్యవస్థలన్నీ కార్యరూపం దాల్చుతాయి.

ఫిర్యాదుదారు, న్యాయవాదులు, లోక్ అదాలత్ సభ్యుల మధ్య ఆన్‌లైన్ చర్చలు, పరిష్కారం కోసం 'V-Solve Virtual Solution Maker' పేరుతో ఒక ప్లాట్‌ఫారమ్ సృష్టించనున్నారు. ఈ వ్యవస్థను కేరళ న్యాయవ్యవస్థ అభివృద్ధి చేసింది. ఇది పూర్తిగా మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌గా నడుస్తోందని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed