Honor X9C: రూ. 28,700 ప్రారంభ ధరతో హానర్ నుంచి మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్.. పూర్తి వివరాలివే..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-06 14:38:50.0  )
Honor X9C: రూ. 28,700 ప్రారంభ ధరతో హానర్ నుంచి మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్.. పూర్తి వివరాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా(China)కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ హానర్(Honor) నుంచి కొత్త ఫోన్ విడుదలైంది. హానర్ ఎక్స్9సి(Honor X9C) పేరుతో దీన్ని గ్లోబల్ మార్కెట్లో(Global Market) లాంచ్ చేశారు. మలేషియా(Malaysia)లో ఈ కొత్త ఫోన్ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా.. భారత మార్కెట్లో(Indian Market)కి త్వరలోనే అందుబాటులోకి రానుంది. 12జీబీ + 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 28,700, 12జీబీ+ 512జీబీ వేరియంట్ ధర రూ. 32,500గా కంపెనీ ఖరారు చేసింది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు ఐపీ65 రేటింగ్‌తో దీన్ని తీసుకొచ్చారు. ఈ హానర్ ఫోన్ జేడ్ సియాన్, టైటానియం బ్లాక్, టైటానియం పర్పుల్ అనే త్రీ కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

హానర్ ఎక్స్9సి మొబైల్ స్పెసిఫికేషన్ల వివరాలు..

  • 6.78 అంగుళాల (1,224 x 2,700 పిక్సెల్‌లు) అమోలెడ్ స్క్రీన్
  • క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 చిప్‌సెట్‌తో(Qualcomm Snapdragon 6 Generation 1 Chipset)తో ఈ మొబైల్ పని చేస్తుంది.
  • ఆండ్రాయిడ్ 14-ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 8.0తో వస్తుంది.
  • 12 జీబీ ర్యామ్+256 జీబీ రోమ్, 12 జీబీ ర్యామ్+512 జీబీ రోమ్
  • 120Hz రిఫ్రెష్ రేట్(120Hz Refresh Rate)
  • ఇక బ్యాక్ సైడ్ 108 మెగా పిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇందులో అమర్చారు.
  • 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6600mAh కెపాసిటీ గల బ్యాటరీని కలిగి ఉంది.
Advertisement

Next Story

Most Viewed