- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ బార్డ్.. వినియోగంలోకి వచ్చేది అప్పుడే?
దిశ, వెబ్‌డెస్క్: ఏదైనా తెలియని సమాచారాన్ని గూగుల్‌లో వెతికి తెలుసుకోవడం ఈరోజుల్లో కామన్‌గా మారిపోయింది. ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా పరిశోధనలో గూగుల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌లో గూగుల్‌కు సరైన పోటీ ఇచ్చే ప్లాట్‌ఫామ్ మరోటి వస్తుందని ఇంతకాలం ఎవరూ ఊహించలేదు. తాజాగా దీనికి చాట్‌జీపీటీ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. దీనిని ధీటుగా ఎదుర్కొనేందుకు సుందర్ పిచాయ్ నేతృత్వంలోని గూగుల్ సైతం సిద్ధమవుతోంది. చాట్‌జీపీటీతో ఆన్‌లైన్ రంగంలో మైక్రోసాఫ్ట్ తెరతీసిన యుద్ధానికి గూగుల్ సైతం తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. బార్డ్ పేరిట ఏఐ ఆధారిత చాట్‌బోట్‌ను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం బార్డ్‌ను టెస్టింగ్ కోసం కొందరికి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సుందర్ పిచాయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత ఈ ఏడాదిలోనే దీనికి విస్తృత స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని వెల్లడించారు.