- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Google Takeout ద్వారా ఈ విధంగా డేటాను బ్యాకప్ పొందండి
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో గూగుల్ అకౌంట్ చాలా ముఖ్యమైనది. గూగుల్‌లో ఏం సెర్చ్ చేసిన, ఫొటోలు, వీడియోలు ప్రతి ఒక్కటి ఖాతాకు సింక్ అవుతాయి. గూగుల్ తన వినియోగదారుల వ్యక్తిగత డేటా స్టోరేజీ కోసం 15GB స్టోరేజ్‌ను అందిస్తుంది. వివిధ డ్యాక్‌మెంట్స్, ఫొటోలు, వీడియోలు, మెయిల్స్, డ్రైవ్ కంటెంట్, క్యాలెండర్‌లు, బ్రౌజర్ బుక్‌మార్క్‌లు, YouTube ఆక్టివిటీ అన్ని కూడా ఇందులో సేవ్ అవుతాయి.
దీనిలో నుంచి మీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మీ డేటాను తిరిగి పొందడానికి అవకాశం కూడా ఉంటుంది. కానీ అన్ని ఒక్కొక్కటిగా డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మీకు కావలసిన డేటా సులభంగా ఒకే ఫైల్ ద్వారా పొందడానికి కంపెనీ 'Google Takeout' ను తీసుకొచ్చింది.
Google లో ఉండే డేటాను Google Takeout బ్యాకప్ ద్వారా తిరిగి పొందవచ్చు. పెద్ద మొత్తంలో స్టోరేజ్ కలిగిన డేటాను సింగిల్ ఫైల్ ద్వారా పొందవచ్చు. అలాగే Google డేటాను ఆటోమెటిగ్‌గా డౌన్‌లోడ్ చేయడానికి Takeoutని షెడ్యూల్ చేసే ఆప్షన్ కూడా ఉంది.
Google Takeout ద్వారా డేటా డౌన్‌లోడ్ చేసుకునే ప్రాసెస్..
1. మొదటగా సెర్చ్ పేజీలో 'Google Takeout' అని ఎంటర్ చేయాలి.
2. తరువాత అకౌంట్‌లో లాగిన్ అయ్యాక, డేటా లాగిన్ ఆక్టివిటీ కనిపిస్తుంది.
3. అందులో మీకు కావాల్సిన బుక్‌మార్క్ ఫైల్‌ను ఎంచుకోవాలి. ఒక వేళ మొత్తం కావాలనుకుంటే అన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
4. సెలెక్ట్ చేసుకున్న తరువాత డేటాకు సంబంధించిన లింక్ జీమెయిల్‌కు సెండ్ అవుతుందని చూపిస్తుంది.
5. ఏ తేదీ నుంచి బ్యాకప్ కావాలనుకుంటున్నారో ముందే ఎంచుకోవాలి.
6. అలాగే, డేటాను ఏ ఫైల్ రూపంలో పొందాలనుకుంటున్నారొ సెలెక్ట్ చేయాలి.
7. ఎంత వరకు డేటా స్టోరేజ్‌తో ఫైల్ డౌన్‌లోడ్ చేయాలనుకున్నారో ఎంచుకోవాలి.
8. ముఖ్యంగా 1GB నుంచి మొదలుకుని 50GB వరకు డేటా పొందవచ్చు.
9. అన్ని సెలెక్ట్ చేశాక, క్రియెట్ ఎక్స్‌పోర్ట్ అని వస్తుంది.
10. తరువాత డేటా డౌన్‌లోడ్ లింక్ మెయిల్‌కు వస్తుంది.
11. ఈ లింక్‌ను క్లిక్ చేస్తే .zip, లేదా .tgz రూపంలో డేటా డౌన్‌లోడ్ అవుతుంది.
12. నెట్ స్పీడ్ ఆధారంగా డేటా డౌన్‌లోడ్ అవుతుంది.