తెలంగాణాలో యువతకు ఉచితంగా స్కూటీస్.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

by Jakkula Samataha |   ( Updated:2024-01-27 06:34:59.0  )
తెలంగాణాలో యువతకు ఉచితంగా స్కూటీస్.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
X

దిశ, ఫీచర్స్ : తెలంగాణ సర్కార్, యువతులకు తీపికబురు అందించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్, త్వరలో స్కూటీస్ కూడా ఇస్తమని తెలిపిన విషయం తెలిసిందే.ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తమ మేనిపోస్ట్‌లో పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చదువుకునే యువతులకు ఆరు నెలలోపు స్కూటీస్ అందిస్తామని పేర్కొంది. కాగా, తెలంగాణ ప్రభుత్వం యువతులకు స్కూటీస్ అందిచే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఫ్రీగా ఎలక్ట్రికల్ స్కూటీస్ అందిచనున్నదని సమాచారం. ఈ నేపథ్యంలో చాలా మందికి ఈ పథకం ఎలా అప్లై చేయాలో క్లారిటీగా తెలియడం లేదు. అలాంటి వారికోసమే ఈ సమాచారం.

ఈ పథకానికి 18 సంవత్సరాలు నిండిన యువతులందరూ అర్హులేనంట. దీనికి కావాల్సిన డాక్యూమెంట్స్ ఏమిటంటే?

1.ఆధార్ కార్డు

2.పాన్ కార్డు

3. పాస్‌పోర్ట్ సైజు ఫొటో

4.రెసిడెన్స్ ప్రూఫ్

5.ఇన్ కామ్ సర్టిఫికేట్

6.క్యాస్ట్ సర్టిఫికేట్

7. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్

అప్లై చేసే విధానం :

ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ (https://telangana.gov.in)లోకి వెళ్లాలి. హోంపేజీలో త్వరలోనే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ అందుబాటులో ఉంచనున్నారు.అప్పుడు స్కూటీ స్కీం అప్లై విధానం క్లిక్ చేయగానే, దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. అందులో మన డిటేయిల్స్, అడ్రస్ ఎంటర్ చేయాలి. తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కి, అప్లై చేయాలి. తర్వాత ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుంది. అర్హతలు, పత్రాలను పరిశీలించి, అన్నీ సరిగానే ఉన్నాయని తేలితే, వారిని అర్హులుగా ఎంపిక చేస్తుంది. ఆ తర్వాత స్కూటీలను ఇస్తుంది.

Advertisement

Next Story

Most Viewed