మీకు తెలియని వాట్సాప్ గ్రూప్ నుంచి మెసేజెస్ వస్తున్నాయా.. అయితే చిక్కుల్లో పడ్డట్లే!

by Jakkula Samataha |
మీకు తెలియని వాట్సాప్ గ్రూప్ నుంచి మెసేజెస్ వస్తున్నాయా.. అయితే చిక్కుల్లో పడ్డట్లే!
X

దిశ, ఫీచర్స్ : సైబర్ నేరగాళ్లు కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు. మంచిగా మాట్లాడి, చివరకు మన బ్యాంకు ఖాతాలకు కన్నం పెడుతున్నారు. ఈ కొత్త మోసాల కోసం ఏకంగా వాట్సాప్‌నే వాడేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కొందరు వారి మాయలో పడటం మాత్రం తప్పడం లేదు. అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పర్సనల్‌గా కాల్ చేయడం, లేదా మెసే చేయడం, వీలైతే వాట్సాప్‌లో జాబ్ ఆఫర్, ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ మోసాలకు పాల్పడిన అనేక ఘటనలు మనం చూశాం. అయితే ఇప్పుడు కొత్తగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, డబ్బులు కాజేస్తున్నారు. వాట్సాప్‌లో గ్రూప్ క్రియేట్ చేసి, అందులో మిమ్మల్ని యాడ్ చేసి ట్రేడింగ్ పేరిట మీ నుంచి డబ్బులు గుంజుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రాలో చోటు చేసుకుంది. సైబర్ నేరగాళ్ల మాయలో పడి ఇద్దరు బ్రదర్స్ రూ.లక్ష రూపాయలు పొగొట్టుకున్నట్టు సమాచారం. అయితే నేరగాళ్లు ఏం చేస్తున్నారంటే? గ్రూప్‌లో కొన్ని టిప్స్ ఇస్తూ ట్రేడింగ్ చేయడానికి ప్రొత్సహిస్తున్నారు. దాంతో వారు డబ్బులు పెట్టి షేర్లను కొనడానికి ఇంట్రెస్ట్ చూపేలా ప్రోత్సహిస్తున్నారు దీంతో వారు షేర్లు కొనుగోలు చేసి అమ్ముకుందాం అనేసరికి సీన్ రివర్స్ అయ్యింది. వారు స్పందించడం మానేశారు. ఇక ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం తెలిసింది. వారు సైబర్ నేరగాళ్ల వలలో పడ్డట్టు తెలుసుకున్నారు. అందువలన వాట్సాప్ గ్రూప్స్, కాల్స్, మెసేజెస్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలియని కొత్త వ్యక్తుల నుంచి మెసేజ్ వస్త జాగ్రత్తపడాలని, ఎలాంటి కొత్త లిక్స్ ఓపెన్ చేయకూడదని వారు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed