అధునాతన ప్రాసెసర్‌తో మార్కెట్లోకి యాపిల్ వాచ్ సిరీస్ 9

by Harish |   ( Updated:2023-08-03 10:51:50.0  )
అధునాతన ప్రాసెసర్‌తో మార్కెట్లోకి యాపిల్ వాచ్ సిరీస్ 9
X

దిశ, వెబ్‌డెస్క్: యాపిల్ కంపెనీ నుంచి కొత్తగా రాబోతున్న సిరీస్ 9 స్మార్ట్‌వాచ్ కొత్త ప్రాసెసర్‌తో మార్కెట్లోకి విడుదల కానుందని సమాచారం. దీన్ని అల్యూమినియం బాడీతో లాంచ్ చేయనున్నారు. మిడ్‌నైట్, స్టార్‌లైట్, రెడ్, సిల్వర్, పింక్ వంటి ఐదు కలర్స్‌లలో లభిస్తుంది. ఇటీవల వచ్చిన నివేదిక ప్రకారం ఇది కొత్త S9 ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఇది కంపెనీ S6 చిప్ తర్వాత రెండో అప్‌గ్రేడ్ వెర్షన్. దీనిలో బ్యాటరీని కూడా మరింత మెరుగ్గా ఎక్కువ కాలం లైఫ్ అందించే విధంగా తయారు చేశారు. కొత్త వాచ్‌లో MicroLED సాంకేతికతతో డిస్‌ప్లే ప్రకాశవంతంగా, మరింత శక్తివంతమైన కలర్స్‌తో పాటు మెరుగైన వీక్షణ కోణాలను అందిస్తుంది. డిస్‌ప్లే సైజు కూడా పెద్దగా ఉండనుంది. ఈ వాచ్‌ను సెప్టెంబర్‌లో మార్కెట్లోకి విడుదల చేయవచ్చని సమాచారం.

Advertisement

Next Story