Apple smartphone: 2026లో యాపిల్ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్: నివేదిక

by Harish |
Apple smartphone: 2026లో యాపిల్ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్: నివేదిక
X

దిశ, టెక్నాలజీ: ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ విడుదల చేస్తుండగా, ఈ విభాగంలో దిగ్గజ కంపెనీ యాపిల్ మాత్రం ఇప్పటికి వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లకు పోటీగా రాబోయే సంవత్సరాల్లో యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని డిజిటైమ్స్ ఆసియా (పేవాల్డ్) నివేదిక తెలిపింది. దాదాపు ఇది 2026లోనే మార్కెట్లోకి రావచ్చని తెలుస్తుంది. అయితే గత నివేదికల ప్రకారం, బుక్-స్టైల్ ఫోల్డింగ్ విధానంలో ఫోన్ వస్తుందని అంచనా వేసినప్పటికీ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఇది ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్‌ మోడల్‌లో వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డిజైన్ రూపకల్పన కూడా చివరి దశకు చేరుకుందని డిస్‌ప్లేను దానికి తగ్గట్టుగా తయారీచేసే పనిని చేపట్టిందని నివేదిక పేర్కొంది. మరోవైపు ఒక టిప్‌స్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం, తదుపరి iPhone SE 4, iPhone 17 సిరీస్, iPhone 17 Pro సిరీస్, కొత్త iPhone 17 Slim ( లేదా అల్ట్రా) మోడల్, 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.



Next Story