- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోకరి ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్.. పూర్తి వివరాలు ఇవే
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది తమకు తెలియకుండానే అనారోగ్యానికి గురవుతున్నారు. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ఇలాంటి అనారోగ్య సమస్యలు తొందరగానే బయటపడుతున్నాయి. మరి ముఖ్యంగా ఆపిల్ వాచ్ పుణ్యమా అని చాలా మంది తమ ప్రాణాలను కాపాడుకున్న సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్లీ ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.
అమెరికాలోని ఒహైయో రాష్ట్రం క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన కెన్ కౌనిహన్ అనే వ్యక్తి ఆపిల్ వాచ్ ధరించిన కారణంగా తన ప్రాణాలు కాపాడుకున్నాడు. వివరాల్లోకి వెళితే, కెన్ కౌనిహన్ ప్రతిరోజు ఆపిల్ వాచ్ ధరించేవాడు. గత అక్డోబర్‌లో తన శ్వాసక్రియ రేటు 14 నుంచి 17-18కి పెరిగినట్లుగా వాచ్ చూపించింది, కానీ ఇది చిన్న విషయం అని భావించిన అతను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. తరువాత ఈ విషయం ఇంట్లో వాళ్ళకు తెలియడంతో వారి బలవంతం మీద హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు.
మందులు వాడిన తర్వాత కూడా అతని రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు 90-95 నుంచి 80-85 తగ్గడం ప్రారంభించాయి. దీంతో యాపిల్ వాచ్ పదే పదే హెల్త్ అలర్ట్స్ చూపిస్తుంది. ఆ తరువాత డాక్టర్లు అతన్ని పూర్తిగా పరీక్షించాక, అతని ఊపిరితిత్తులలో రక్తం గడ్డ కట్టినట్టు గుర్తించారు. దీంతో ట్రీట్‌మెంట్ అందించి అతని ప్రాణాలను కాపాడారు. ట్రీట్‌మెంట్ అందించిన డాక్టర్ లూసీ ఫ్రాన్జిక్ మాట్లాడుతూ, రక్తం గడ్డకట్టడం గురించి త్వరగా తెలుసుకోవడం చాలా మంచిదైందని లేకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. ఆపిల్ వాచ్ కారణంగా అతని హెల్త్ కండీషన్ గురించి తెలుసుకుని త్వరగా ట్రీట్‌మెంట్ అందించామని డాక్టర్ తెలిపారు.
Also Read...