- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో టెక్ మహీంద్రా క్యాంపస్‌కు సీల్!
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల బజాజ్ ఆటో ముంబై ప్లాంట్‌లో వందల్లో కేసులు నమోదవడం తెలిసిందే. తాజాగా కరోనా వ్యాప్తి ప్రముఖ టెక్ కంపెనీ టెక్ మహీంద్రాకు సైతం చేరింది. గతవారం భువనేశ్వర్‌లో టెక్ మహీంద్రా ఆఫీసును తాత్కాలికంగా మూసేశారు. మంగళవారం భువనేశ్వర్ మునిసిపల్ కార్పోరేషన్ వారు టెక్ మహీంద్రా క్యాంపస్‌ను సీల్ చేశారు. కొవిడ్-19 కేసులు నమోదైన తర్వాత సంస్థ కార్యాలయాన్ని శానిటైజేషన్ చేసేందుకు మూడు రోజుల పాటు మూసి వేసినట్లు భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ప్రమోద్ కుమార్ చెప్పారు.
వారం క్రితం కంపెనీలోని ఉద్యోగులకు కరోనా సోకిందని, దీంతో మొత్తం 65 మంది ఉద్యోగులను హోమ్ క్వరంటైన్‌కు పంపించినట్టు, అనుమానం ఉన్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ప్రమోద్ వివరించారు. అంతేకాకుండా కాంటాక్ట్ ట్రేసింగ్ ఉపయోగించి మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.