- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్ల్యూటీసీలో టీమ్ ఇండియా జెర్సీ ఇదే..
దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్ జట్టుతో జరుగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు సరికొత్త జెర్సీలో కనిపించనున్నది. బీసీసీఐ ఈ జెర్సీని అధికారికంగా ఆవిష్కరించకపోయినా.. టీమ్ ఇండియా ఆల్ రౌండర్ ఆ సరికొత్త జెర్సీ ధరించి సోషల్ మీడియాలో ఫొటో పోస్టు చేశాడు. అయితే ఆ జెర్సీ సరికొత్తగా రూపొందించింది కాదు. భారత జట్టు 1990లలో వేసుకున్న టెస్టు జెర్సీని పోలి ఉన్నది. అలాంటి మోడల్ జెర్సీపైనే ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ అని రాసి ఉన్నది. మరోవైపు బీసీసీఐ లోగోను ముద్రించారు. దాని కింద ఇండియా అని పెద్ద అక్షరాలతో రాసి ఉన్నది.
సోషల్ మీడియాలో ఈ పోస్టు పెట్టి ‘రివైన్డ్ టూ 90స్’ అంటూ రవీంద్ర జడేజా కామెంట్ కూడా పెట్టాడు. చూడటానికి మంచి రెట్రో లుక్‌తో జెర్సీ అదిరిపోతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో గాయ పడటంతో ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరమైన జడేజా ఐపీఎల్ 2021లో ద్వారా తిరిగి క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టుతో ముంబైలోని హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నాడు.