చెన్నై టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్

by Shiva |   ( Updated:2021-02-16 02:55:25.0  )
చెన్నై టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
X

దిశ,వెబ్‌డెస్క్: చెన్నైలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టుపై భారత్ 317 పరుగుల తేడాతో అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల స్పిన్ మాయాజాలంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 164పరుగులకే అలౌట్ అయింది. ఆల్ రౌండర్ అక్షయ్ పటేల్ ఏకంగా 5 వికేట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అటు అశ్విన్ కూడా రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఎనిమిది వికేట్లు తీసి ఈ టెస్టులో తన సత్తా చాటాడు.

ఈ టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 329 పరుగులను చేసిన టీం ఇండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు అలౌట్ అయింది. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో 134 పరుగలకే ఇంగ్లండ్ జట్టు అలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ అందరూ చేతులు ఎత్తేశారు. దీంతో 164 పరుగులకే ఇంగ్లండ్ అలౌట్ అయింది. ఈ విజయాన్ని ఖాతాలో వేసుకుని 4 టెస్టుల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది.

Cricket
Cricket
Advertisement

Next Story