- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మన కుర్రాళ్లు మరోసారి దుమ్ములేపుతారా..? గెలిస్తే సిరీస్ మనదే..
దిశ, వెబ్‌డెస్క్ : టీం ఇండియా యువజట్టు శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఇవాళ సెకండ్ వన్డే జరగనుంది. తొలి మ్యాచ్ గెలిచిన సంబురంలో ఉన్న కుర్రాళ్లు అదే బూస్టింగ్‌తో మరోసారి దుమ్ములేపుతారా? అనేది చూడాలి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు కూడా ధావన్ సేన సత్తా చాటితే ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ఇండియా సొంతం అవుతుంది. అయితే, తొలి మ్యాచ్‌లో అందరూ రాణించడంతో ఈరోజు టీంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని తెలుస్తోంది.
కాగా, శ్రీలంక జట్టు మాత్రం తొలిమ్యాచ్‌లో చేసిన తప్పులను మరోసారి రిపీట్ కాకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఒకవేళ అతిథ్య జట్టు ఈరోజు కూడా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగితే.. భారీ స్కోర్ సాధించి ఇండియాను కట్టడి చేస్తే తప్ప సిరీస్ పదిలంగా ఉంటుంది. లేదా మరోసారి మన కుర్రాళ్ల దెబ్బకు లంక టీం కుదేలవ్వకతప్పదు. కాగా, ఇవాళ్టి మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని సమాచారం.